తెలంగాణ

Good News: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన చికెన్, కోడిగుడ్ల ధరలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

గత కొన్ని వారాలుగా ఆకాశాన్నంటిన చికెన్, కోడిగుడ్ల ధరలు ప్రస్తుతం క్రమంగా దిగొస్తున్నాయి. ధరలు తగ్గడంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో వినియోగదారులకు తీపి కబురు అందింది. గత కొద్ది రోజులుగా చికెన్, గుడ్ల ధరలు మండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న మార్కెట్ ధరలు ఊరటనిస్తున్నాయి.

 ఎండల తీవ్రత తగ్గడం, ఉత్పత్తి క్రమంగా పెరగడం, హోల్‌సేల్ మార్కెట్‌లలో సరఫరా పుంజుకోవడంతో ప్రధాన నగరాల్లో ఈ పతనం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు వారాల క్రితం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300నుంచి రూ.330వరకు పలికిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు అది క్రమంగా తగ్గుముఖం పట్టి రూ.250 నుంచి రూ.280 మధ్యకు చేరుకుంది. అదేవిధంగా రిటైల్ మార్కెట్‌లో మునుపటి కంటే కోడిగుడ్డు ధరలు గణనీయంగా తగ్గాయి.

గతంలో ఒక్కో గుడ్డు ధర రూ.8నుంచి రూ.9వరకు విక్రయించగా, ప్రస్తుతం అది రూ.6 నుంచి రూ.7లకే వినియోగదారులకు లభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల మార్కెట్లలో వ్యత్యాసాలతో కూడిన నూతన ధరలు నమోదయ్యాయి. హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతాలలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.270వరకు ఉంది. అదేవిధంగా ఖమ్మం, గుంటూరు, నిజామాబాద్ నగరాల్లో రూ.280వద్ద విక్రయాలు సాగుతుండగా, వరంగల్ మార్కెట్‌లో అతి తక్కువగా రూ.250కి లభిస్తోంది.

పౌల్ట్రీ రంగంలో కోళ్ల దిగుబడి పెరగడం, ఆహార దినుసుల సరఫరా మెరుగుపడటంతోనే ఈ ధరల తగ్గుదల సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో శ్రావణ మాసం, పండుగల సీజన్ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నందున ధరలు మరింత నిలకడగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

#Chicken Prices#Egg Rates#Telangana Meat Prices#Hyderabad Chicken Rate#Poultry Market#Andhra Pradesh Meat Prices#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి