సినిమా

Keerthy Suresh: రెండు రోజులకే రూ.కోటి రెమ్యునరేషన్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Keerthy Suresh: గత కొన్నేళ్ళు మన స్టార్ హీరోయిన్స్ చాలామంది స్పెషల్ నంబర్స్ లో అలరించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, సమంత, శ్రీలీల, రాశీ ఖన్నా లాంటి వారు స్టార్ హీరోయిన్స్ గా భారీ చిత్రాల్లో నటిస్తూనే, బిగ్ స్టార్ కోసం ఐటం భామగా కూడా మారుతున్నారు. కాలానికి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాల కోసం మన హీరోయిన్స్ బాగానే రిస్క్ చేస్తున్నారు.

అందుకే, ఐటం సాంగ్స్ కొన్ని సార్లు ఫ్యూచర్ మీద ప్రభావం చూపిస్తుందని తెలిసినా, హ్యూజ్ రెమ్యునరేషన్ వస్తుందనే ఆశతో ఒప్పేసుకుంటున్నారు. మహా అయితే ఒక్కో సాంగ్ కోసం మూడు లేదా నాలుగు రోజుల డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. కానీ, ఎంత కాదన్నా కోటి పైనే ఒక్క స్పెషల్ నంబర్ కి రెమ్యునరేషన్ అందుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది.

అందుకే, చేతిలో పెద్ద సినిమా ఉన్నా కూడా సమంత, శ్రీలీల, పూజా హెగ్డే, కాజల్ లాంటి వారు ఐటం సాంగ్స్ ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో ఐటం సాంగ్ అంటే అన్నీ భాషల్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఒక్కో సాంగ్ కోసం దాదాపు 2 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం. ఆ లిస్ట్ లో ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ కూడా చేరింది.

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ది ప్యారడైజ్ సినిమా రూపొందుతోంది. 7 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీలో కీర్తి స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. అయితే, ఈ సాంగ్ కోసం కీర్తి కేవలం 2 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చిందట. ఈ రెండు రోజులకే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కీర్తికి ఆశించిన విజయాలు అందలేదు. పైగా దసరా టీమ్ కావడంతో ఒప్పుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేమైనా, ఈ సాంగ్ గనక కీర్తికి మంచి పేరు తెస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ నంబర్స్ లో అలరించడం గ్యారెంటీ.

#keerthysuresh#keerthyitemsong#theparadaise#nani#srikanthodela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి