Bollywood: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులో రెండు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఒకటి, ఎల్లమ్మ కాగా, మరోటి రౌడీ జనార్ధన. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా నటిస్తున్నాడు. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడు. ఇంకా, ఈ సినిమాలో హీరోయిన్ కన్‌ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం, హైదరాబాద్ కీసర ప్రాంతంలో భారీ సెట్ నిర్మించి షూట్ చేస్తున్నారు.
అలాగే, విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ జంటగా రౌడీ జనార్ధన చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొంతకాలంగా నిర్మాతగా దిల్ రాజుకి, హీరోగా విజయ్ దేవరకొండకి ఆశించిన విజయాలు దక్కలేదు. అందుకే, ఈ సినిమాలపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. పైగా, గేమ్ ఛేంజర్ సినిమాతో బాగా నష్టాలను చూశాడు దిల్ రాజు.
ఇది కాకుండా, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి ఏదన్నా కలిసి వచ్చే అంశం ఉందంటే అది ఒక్క నయనతార మాత్రమే. దీనికి కారణం సల్మాన్ కి బాలీవుడ్ లో గత కొన్నేళ్ళుగా హిట్ లేదు. తెలుగులో చేసిన గెస్ట్ రోల్ కూడా ఉపయోగపడలేదు.
ఇలాంటి, పరిస్థితుల్లో దిల్ రాజు పెద్ద డేరింగ్ స్టెప్ వేసి సల్మాన్ తో సినిమాను చేస్తున్నాడు. అందుకే, ఈ కండల వీరుడు మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ కోసం దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. ఒక్కో సినిమాకి సల్మాన్ 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అయితే, అటు దిల్ రాజుకి సక్సెస్‌లు లేకపోవడం, సల్మాన్ ది ఇదే పరిస్థితి కావడంతో ఇంత హ్యూజ్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. ఇదే, గనక నిజమైతే సల్మాన్ గ్రేట్ అనాల్సిందే. ఇంతకముందు తెలుగులో చేసిన చిరు సినిమా గాడ్ ఫాదర్ లో కూడా పైసా తీసుకోకుండా యాక్ట్ చేశాడు.












