క్రైమ్

Real Estate Fraud: 17కోట్ల రియల్ ఎస్టేట్ మోసం.. DNC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ దిరిశాల నరేష్ చౌదరిపై కేసు

రచన: NK5 నిమిషాల పఠనం

హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగుచూసింది. రూ.17.10 కోట్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలో మోసం జరిగిందంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త వేముల సత్యమూర్తి ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డీఎన్సీ (DNC) ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దిరిశాల నరేశ్ చౌదరితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ- ఎంసీసీ అబిడ్స్ శాఖ) బ్రాంచ్ హెడ్ రమేశ్ బాబు, మెయిన్ సర్కిల్ కార్యాలయం సర్కిల్ హెడ్ అరవింద్ కోల్రా, బ్యాంక్ స్ట్రీట్ శాఖ చీఫ్ మేనేజర్ సందీప్‌ పై కేసు నమోదైంది.

Real Estate Fraud: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగుచూసింది. రూ.17.10 కోట్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలో మోసం జరిగిందంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త వేముల సత్యమూర్తి ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డీఎన్సీ (DNC) ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దిరిశాల నరేశ్ చౌదరితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ- ఎంసీసీ అబిడ్స్ శాఖ) బ్రాంచ్ హెడ్ రమేశ్ బాబు, మెయిన్ సర్కిల్ కార్యాలయం సర్కిల్ హెడ్ అరవింద్ కోల్రా, బ్యాంక్ స్ట్రీట్ శాఖ చీఫ్ మేనేజర్ సందీప్‌ పై కేసు నమోదైంది.

సత్యమూర్తికి సంబంధించి మలక్‌పేట్‌లో 1032 గజాలలో ఉన్న శ్రీహర్ష కాంప్లెక్స్ రూ.17.10 కోట్లకు కొనుగోలు చేసేందుకు నరేశ్ చౌదరి ఒప్పందం కుదుర్చుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.25 కోట్లు రుణం మంజూరైనట్లు ఆమోదపత్రాన్ని చూపించడంతో బాధితుడు 2024 నవంబర్ 26న రిజిస్టర్ సేల్ డీడ్‌ను నమోదు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో రూ.15 కోట్లకు 3 చెక్కులు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని నరేశ్ చెల్లించలేదని బాధితుడు ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు నరేశ్ ఇచ్చిన చెక్కులను బ్యాంక్‌లో వేస్తే బౌన్స్ అయ్యాయని వాపోయారు.

కాగా, బ్యాంక్ అధికారులు ఆస్తిపై పరిశీలన లేకుండా రూ.25 కోట్లు రుణాన్ని మంజూరు చేసి, డీఎన్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ దిరిశాల నరేశ్‌ చౌదరికి విడుదల చేశారు. ఈ వ్యవహారంలో నరేశ్ చౌదరి తనను, బ్యాంక్ ను కూడా మోసం చేసి లోన్ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించికున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో బ్యాంకు అధికారుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని ఫిర్యాదులో పొందుపరిచారు. దీనిపై సీసీఎస్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 178/2026 కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. రియల్ ఎస్టేట్ మోసంపై బాధితుడు సీబీఐకి సైతం ఫిర్యాదు చేశారు. డీఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న దిరిశాల నరేష్ చౌదరిపై హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో తో పాటుగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 20కి పైగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

#Real Estate Fraud#Hyderabad#Banjara Hills#DNC Infrastructure Pvt Ltd#Dirishala Naresh Chowdary#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి