National

GST : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సత్తా చాటిన తెలంగాణ!

రచన: Venu4 నిమిషాల పఠనం

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. భారత ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగడం ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక రిఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు కూడా 15.8 శాతం పెరిగి రూ.1.81 లక్షల కోట్లకు చేరాయి.

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జులై నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలు.. దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. జీఎస్టీ వృద్ధిలో హర్యానా మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణ, గుజరాత్ చెరో 19 శాతం వృద్ధితో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. హర్యానాలో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 25 శాతం పెరగడం విశేషం.

దేశవ్యాప్తంగా జులై నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. దీంతో వరుసగా రెండో నెల కూడా దేశ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 28.8 శాతం పెరిగి రూ.66,511 కోట్లకు చేరాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. భారత ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగడం ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక రిఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు కూడా 15.8 శాతం పెరిగి రూ.1.81 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ నికర జీఎస్టీ ఆదాయం రూ.1.27 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతులపై నికర జీఎస్టీ వసూళ్లు రూ.54,223 కోట్లుగా నమోదయ్యాయి.

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. పంజాబ్, కేరళలో జీఎస్టీ వృద్ధి 16 శాతంగా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో 15 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం తగ్గుదల నమోదు కాగా.. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 22 శాతం క్షీణత నమోదైంది. ఉత్తరాఖండ్‌లో 18 శాతం, పుదుచ్చేరిలో 17 శాతం, మధ్యప్రదేశ్‌లో 10 శాతం తగ్గుదల కనిపించింది.

తమిళనాడులో వృద్ధి కేవలం 1 శాతానికే పరిమితమైంది. మొత్తంగా చూస్తే.. జీఎస్టీ వసూళ్లలో నమోదైన ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగం, వ్యాపార కార్యకలాపాలు, పన్ను వసూళ్ల సామర్థ్యం మరింత బలపడుతున్నాయని చెప్పే సూచికగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

#National#Telangana#GST#lakh crore#july
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి