Varun Tej: మెగా ఫ్యామిలీ హీరోలలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా వరుణ్ సినిమాల ఎంపికలో ఓ శైలిని ఏర్పరచుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ నుంచి సినిమా రాలేదనే చెప్పాలి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళి చేసుకున్న వరుణ్ ఓ బిడ్డకి తండ్రైయ్యాడు.
ఇన్నాళ్ళు తండ్రి స్థానంలో ఉండి ఆనందమైన జీవితాని ఆస్వాదించాడు. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. వరుణ్ గతంలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఉన్నట్టుగానే ఓ డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు.
తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. కాగా, కొరియన్ కనకారజు చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఆరోజు మరో సినిమా పోటీ లేకపోవడంతో ప్రస్తుతానికి, వరుణ్ కి సోలో డేట్ దొరికింది.
టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని హర్రర్, కామెడి జోనర్‌లో రూపొందిస్తున్నాడు. కొంత కొరియన్ నేపథ్యం ఆ తరహా డైలాగులు కూడా ఉండబోతున్నాయి. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.












