సినిమా

Lenin : అఖిల్ హిట్ కొట్టాడు..నాగ్ ఎమోషనల్ అయ్యాడు

రచన: Anshu3 నిమిషాల పఠనం

Lenin : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఈ సినిమా జూలై 10వ తేదిన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడటం, హీరోయిన్ మారిపోవడం, అఖిల్ కెరీర్‌లో ఇప్పటి వరకూ సరైన హిట్ లేకపోవడంతో వాస్తవానికి ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఏమాత్రం అంచనాలు లేవనే చెప్పాలి.

కానీ, ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు అఖిల్ మెచ్యూర్డ్ స్పీచెస్, నాగార్జున నమ్మకం, కథలో బలం, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్..నిర్మాణ విలువలు..ఇలా అన్నీ కలిపి సినిమా హిట్ టాక్ కి కారణమయ్యాయి. లెనిన్ మూవీ థియేటర్స్‌లోకి వచ్చీ రాగానే పాజిటివ్ టాక్ వచ్చింది.

చాలాచోట్ల నుంచి హిట్, సూపర్ హిట్ టాక్ వస్తోంది. దాంతో, అఖిల్ ఎంతో ఆనందంతో నాగార్జున కాళ్ళపై పడిపోయాడు. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత అఖిల్ కి సాలీడ్ హిట్ దక్కిందన్న మాట వినేసరికి నాగార్జున కళ్ళలో అన్నందభాష్పాలు కనిపించాయి. చెప్పాలంటే, అఖిల్ కెరీర్ గురించి తండ్రి నాగార్జున చాలా వరీ అయ్యేవాడు.

లెనిన్ దెబ్బతో అఖిల్ ఖాతాలో మంచి హిట్ చేరేసరికి..తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక, ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహిస్తూ కేక్ కట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం, దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, సమంత స్వయంగా అఖిల్ కి శుభాకాంక్షలు తెలపడం కూడా ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది.

#lenin#akhilakkineni#bhagyasriboarse#nagarjuna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి