Dulquer Salmaan: మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మలయాళ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషలలోనూ హీరోగా మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు.
ఆ తర్వాత తెలుగులో నటించిన సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సపరేట్ మార్కెట్ ని, క్రేజ్ ని సాధించాడు. తెలుగు మేకర్స్ కూడా దుల్కర్ కోసం కథలను తయారు చేస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు ఈ హీరోతో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి. అలా చేస్తున్న మరో స్ట్రైట్ తెలుగు సినిమా శ్రీ శ్రీ.
తాజాగా, ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఇందులో, దుల్కర్ సల్మాన్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే, చిత్రీకరణ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్లాస్ సినిమాగా తెరకెక్కుస్తున్నట్టుగా పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. పూజా హెగ్డే నేచురల్ లుక్ లో చాలా సింపుల్‌గా కనిపిస్తోంది.
ఇక, ఈ సినిమాకి నూతన దర్శకుడు రవి నెలకుడితి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో ది ప్యారడైజ్ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మిస్తోంది. ఇక, జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గత కొంతకాలంగా పూజా హెగ్డేకి ఆఇంచిన హిట్ దక్కడం లేదు. తెలుగు సినిమాలలో కనిపించి చాలా కాలమే అయింది.మరి, శ్రీ శ్రీ సినిమాతోనైనా హిట్ కొట్టి మళ్ళీ టాలీవుడ్‌లో పాగా వేస్తుందా చూడాలి.












