వైరల్ న్యూస్

BSNL: టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారిన బీఎస్ఎన్‌ఎల్ ఫోన్.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!..

రచన: Venu6 నిమిషాల పఠనం

భారతదేశంలో టెలికాం రంగాన్ని శాసించిన బీఎస్ఎన్‌ఎల్ వైభవం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన ఈ సంస్థ, 2000వ దశకంలో అత్యధిక లాభాలు ఆర్జించిన కంపెనీలలో ఒకటిగా వెలుగొందింది.

భారతదేశంలో టెలికాం రంగాన్ని శాసించిన బీఎస్ఎన్‌ఎల్ వైభవం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థగా ఉండేది. టెలికాం రంగంలోకి ప్రైవేట్ సంస్థల రాకముందు.. ప్రతి ఇంటా బీఎస్ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్‌ ఫోన్ లు ఉండేవి.

కాగా ఈ నెట్ వర్క్ నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు సైతం టెలిఫోన్ సేవలను అందించిన ఏకైక సంస్థ బీఎస్ఎన్‌ఎల్. అప్పట్లోనే 'కార్డ్ లెస్ ఫోన్లు' 'వింగ్స్' వంటి సేవలను పరిచయం చేసింది.

టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన ఈ సంస్థ, 2000వ దశకంలో అత్యధిక లాభాలు ఆర్జించిన కంపెనీలలో ఒకటిగా వెలుగొందింది. డేటా అనేది సామాన్య ప్రజలకు చేరువ కావడానికి ముందే, బీఎస్ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఆధారిత 'బ్రూడ్‌బ్యాండ్' సేవలతో ఇంటర్నెట్‌ను భారతదేశానికి పరిచయం చేసింది. ఇంతటి చరిత్ర ఉన్న BSNLకు ప్రైవేట్ టెలికాం సంస్థల ప్రవేశంతో చిక్కుల్లో పడింది.

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో జరిగిన జాప్యం, 4జీ మరియు 5జీ సేవలను సకాలంలో విస్తరించలేకపోవడం వల్ల భారీగా నష్టాలను చవిచూసింది. అయితే ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో, వినియోగదారులు తిరిగి బీఎస్ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటికే సామాన్యులకు అందుబాటులో ఉండేలా పలు రీఛార్జ్ ప్లాన్ లను చౌకగా అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ.. పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న బీఎస్ఎన్‌ఎల్ సంస్థ.. తాజాగా సరికొత్త సంచలనానికి తెరలేపింది. మార్కెట్లోకి ఏకంగా రూ. 1,34,166 ధర కలిగిన ఒక వినూత్నమైన ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ ప్రీమియం మోడల్స్, శామ్‌సంగ్ అల్ట్రా సిరీస్ ఫోన్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రస్తుతం ప్రపంచంలోని జనం వాడుతున్న మొబైల్ ఫోన్లు భూమిపై ఉండే టవర్ల సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. టవర్లు లేని అడవులు, కొండలు లేదా సముద్రాల మధ్యలోకి వెళ్తే సాధారణ ఫోన్లలో సిగ్నల్స్ రావు. కానీ ఈ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల భూమిపై ఎలాంటి మొబైల్ నెట్‌వర్క్ లేదా టవర్లు లేకపోయినా ఇది పనిచేస్తుంది.

అదీగాక ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లు సైతం పంపుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఇందులో ప్రత్యేకంగా SOS ఎమర్జెన్సీ అలర్ట్ ఫీచర్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే ఈ ఫోన్ ను సాధారణ ప్రజలు నేరుగా మార్కెట్లోకి వెళ్లి కొనుగోలు చేయడానికి వీల్లేదు. టెలికాం శాఖ నుంచి ముందస్తుగా అనుమతులు పొందిన సంస్థలు లేదా వ్యక్తులు మాత్రమే దీనిని కొనుగోలు చేయాలి.

ఇక బీఎస్ఎన్ఎల్ ఈ శాటిలైట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లను సిద్ధం చేసింది. ప్రభుత్వ, కమర్షియల్ విభాగాలకు వేర్వేరు ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం కనీస ప్లాన్ ధర రూ. 3,500 (20 నిమిషాల టాక్ టైమ్) కాగా.. ప్రైవేట్ సంస్థలకు రూ. 11,670 (60 ని. టాక్ టైమ్)గా నిర్ణయించారు. కమర్షియల్ విభాగంలో వార్షిక ప్లాన్ ధరను ఏకంగా రూ.64,185గా (360 నిమిషాల ఉచిత టాక్ టైమ్ తో) అందిస్తుంది.

ఇక ఫ్రీ కాల్స్ లిమిట్ దాటిన తర్వాత ప్రభుత్వ వినియోగదారులకు నిమిషానికి రూ. 18, కమర్షియల్ వినియోగదారులకు నిమిషానికి రూ. 25 చొప్పున ఛార్జ్ చేయనున్నట్టు సంస్థ అధికార వర్గాలు తెలిపాయి.

#BSNL#Satellite#Phone#Rs 1#34#166#Voice calling#without-mobile-network#SOS Emergency Alerts
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి