సినిమా

Lenin Review: అఖిల్ రస్టిక్ యాక్షన్ హిట్టా.. ఫట్టా?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Lenin Review: అక్కినేని యువ హీరో అఖిల్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా అఖిల్‌కు సాలిడ్ హిట్‌ను అందించిందా? అసలు థియేటర్ల వద్ద టాక్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

Lenin Review: అక్కినేని యువ హీరో అఖిల్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా అఖిల్‌కు సాలిడ్ హిట్‌ను అందించిందా? అసలు థియేటర్ల వద్ద టాక్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఆ ఊర్లో జరిగే ద్రౌపది అమ్మవారి ఉత్సవాల సమయంలో ఎలాంటి గొడవలు, రక్తపాతం జరగకూడదనేది పెద్దల నియమం. కానీ, ఊహించని విధంగా అదే సమయంలో హీరో ప్రాణ స్నేహితుడు దారుణ హత్యకు గురవుతాడు. నియమాలను బద్దలు కొడుతూ జరిగిన ఈ దారుణానికి హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అసలు ఆ హత్య వెనుక ఉన్న ఊరి రాజకీయాలు ఏంటి? అనేదే లెనిన్ మెయిన్ స్టోరీ.

ఫస్టాఫ్: స్లో స్టార్ట్.. సాలిడ్ ఇంటర్వెల్!

సినిమా ప్రారంభం చాలా సీరియస్‌గా, ఊరి వాతావరణాన్ని చూపిస్తూ మొదలవుతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, పల్లెటూరి రాజకీయాంశాలతో కథ కొద్దిగా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెచ్చినప్పటికీ, అఖిల్ మాస్ ఎలివేషన్లు, లవ్ స్టోరీ బోర్ కొట్టించకుండా కాపాడాయి. అయితే, ప్రీ-ఇంటర్వెల్ నుండి సినిమా ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. ఊహించని సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై అంచనాలను మేకర్స్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు.

సెకండాఫ్: మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. హై-వోల్టేజ్ యాక్షన్!

ద్వితీయార్ధం ప్రారంభంలో కథ కాస్త సాగదీసినట్లు అనిపించినా, కథనంలో వచ్చే కొన్ని కీలకమైన ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. అఖిల్ చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్‌గా మారాయి. అక్కడక్కడా డ్రాగ్స్ మినహాయిస్తే, ఒక కమర్షియల్ యాక్షన్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో బాగానే కుదిరాయి.

హిట్టా.. ఫట్టా?

చివరగా చెప్పాలంటే.. 'లెనిన్' అఖిల్ కెరీర్‌లో ఒక పర్‌ఫెక్ట్ రస్టిక్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. కథలో అక్కడక్కడా కాస్త నెమ్మదించినా, ఎండ్ కార్డ్ పడే సమయానికి ఒక మంచి యాక్షన్ సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియన్స్‌కు కలుగుతుంది. ప్రీమియర్స్ నుండి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా అబోవ్ యావరేజ్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ఈ సినిమా మరింత పెద్ద హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాస్, రస్టిక్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి లెనిన్ కచ్చితంగా నచ్చుతుంది.

#LeninReview#akhil akkineni#bhagyasriboarse#nagarjuna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి