క్రీడలు

FIFA World Cup-2026 : సెమీస్ చేరిన స్పెయిన్.. పోరాడి ఓడిన బెల్జియం

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup-2026)లో సెమీస్ రేసు చాలా రసవత్తరంగా సాగుతోంది. కీలక జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను చిత్తు చేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup-2026)లో సెమీస్ రేసు చాలా రసవత్తరంగా సాగుతోంది. కీలక జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను చిత్తు చేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో మంగళవారం డాలస్‌లో జరగబోయే మొదటి సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌తో స్పెయిన్ తలపడనుంది.

బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ 30వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ప్లేయర్ ఫాబియన్ రుయిజ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. బెల్జియం కూడా ఏమాత్రం తగ్గకుండా పోరాడింది. 41వ నిమిషంలో ఆ జట్టు ప్లేయర్ చార్లెస్ డి కెటెలార్ మెరుపు గోల్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసేవరకు ఇరు జట్లు సమానంగా నిలిచాయి.

ఇక సెకండాఫ్‌లో ఇరు జట్లు గట్టిగా నిలబడ్డాయి. మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్తుందని భావించిన తరుణంలో.. 88వ నిమిషంలో స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ మికేల్ మెరీనో మరో గోల్ కొట్టి బెల్జియం ఆశలపై నీళ్లు చల్లాడు. చివరి నిమిషాల్లో బెల్జియం ఎంత ప్రయత్నించినా స్పెయిన్ అడ్డుగోడలా నిలిచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఫలితంగా ప్రపంచకప్‌లో ఆ జట్టు కథ ముగిసింది. తదుపరి జరిగే ఫ్రాన్స్, స్పెయిన్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

#sports#FIFA World cup-2026#belgium out#international
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి