రాజకీయాలు

Kavitha : ఆరు హత్యలకు సీఎం రేవంత్‌దే బాధ్యత.. రాజీనామా చెయ్ : కవిత

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఆరు దారుణ హత్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఆరు దారుణ హత్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడలో జరిగిన ఆరు హత్యలపై ‘ఎక్స్’ వేదికగా కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు.హైదరాబాద్ నగర శివార్లలో ఒకేరోజు ఆరు హత్యలు జరిగాయంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్‌పై బయటకు వచ్చి 17 ఏళ్ల బాలికను, తల్లిని, నాయనమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడని.. చివరికు కనికరం కూడా లేకుండా భార్య, పిల్లలను చంపేయడం దారుణమని పేర్కొన్నారు. ఇన్ని హత్యలు చేస్తున్నా నిఘా వ్యవస్థ, పోలీసులు నిందితుడిని ఆపలేకపోవడం సిగ్గుచేటని కామెంట్ చేశారు. ఇంతటి క్రూర నేర ప్రవృత్తి ఉండి పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని.. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో ఆరు హత్యలకు కారణమైన, సీఎం, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే తన పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

https://x.com/pulsenewsbreak/status/2075786201533956543?s=20

#kalvakuntla kavitha#six murders#rangareddy#pocso accused#crime#cm revanth resign
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి