సినిమా

Nithin: లైనప్‌లో దర్శకులందరూ అలాంటి వారే!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Nithin: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యూత్ స్టార్ గా నితిన్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసినప్పటికీ, గత కొన్నేళ్ళుగా హిట్ కోసం పడరాని పాట్లన్నీ పడుతున్నాడు. ఎప్పుడో రష్మిక మందన్న ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లో భీష్మ అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు, నేషనల్ క్రష్‌గా రష్మిక రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో ఉంది.

నితిన్ మాత్రం అప్పటికే, యూత్ స్టార్ అనే ట్యాగ్ ఉన్నవాడు. కానీ, మిగతా హీరోలకంటే రేసులో చాలా వెనకబడిపోయాడు. వరుసగా సినిమాలు చేసినప్పటికీ, అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. గత చిత్రం తమ్ముడు హిట్ అయి ఉంటే ఇప్పుడు, నితిన్ మరోలా ప్లాన్ చేసుకునేవాడు. అందుకే, ప్రస్తుతం లైనప్ చేసుకున్న సినిమాలకి కొత్త దర్శకులు, లేదా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే.

అలాంటి, దర్శకుల్లో కసి ఉంటుంది. ఇక, నితిన్ చేతిలో ఉన్న సినిమాలను శ్రేష్ఠ్ మూవీస్ ఒకటి నిర్మిస్తోంది. సితార నాగవంశీ ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ఒకటి చేస్తున్నాడు. బిజినెస్ పరంగా ఈ మూడు నిర్మాణ సంస్థలకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి, దర్శకులు కొత్త వారైనా పర్లేదు. కథలో దమ్ముంటే నితిన్ కి హిట్ గ్యారెంటీ. చూడాలి, మరి ఈ మూడు సినిమాలతోనైనా మళ్ళీ మన యూత్ స్టార్ ఫామ్ లోకి వస్తాడేమో.

#nithin#nagavamshi#nani#rashmikamandanna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి