Puri Jagannadh: స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్..ఇలాంటి టైటిల్స్ పెట్టగల దర్శకుడెవరైనా ఉన్నాడంటే అది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాత్రమే. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ఇటీవల వచ్చిన టీజర్‌కి విషేషమైన స్పందన లభించింది. అయితే, ఇప్పటి వరకూ సినిమా విడుదలపై క్లారిటీ లేదు.
సాధారణంగా సినిమా షూటింగ్ మొదలయ్యాక 100 రోజుల్లోపే థియేటర్స్‌లో వచ్చేస్తుంది పూరి సినిమా. కానీ, స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ మూవీ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. ఇంకా, ఫైనల్ ఎడిటింగ్ పనుల్లోనే ఉంది. బిజినెస్ కూడా స్టార్ట్ అవలేదు. దీనికి, కారణం పూరి జగన్నాధ్ గత చిత్రాల ప్రభావమే అంటున్నారు. విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ డిజాస్టర్.
ఆ తర్వాత రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్. దాంతో, ఈ సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాలను కొంతవరకూ భర్తీ చేస్తామని నిర్మాతలు ఛార్మీ, పూరి జగన్నాధ్ మాటిచ్చారట. కానీ, అది ఇంకా చేయలేదనే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ చిత్రాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదట. అంతేకాదు, తమ నష్టాలను భర్తీ చేసిన తర్వాతే సినిమా రిలీజ్ చేయమని తేల్చిపారేశారు.
దాంతో, స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూరి జగన్నాధ్ క్లారిటీ ఇస్తేగానీ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడదు. కాగా, ఈ సినిమాలో సంయుక్త, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో పూరి-ఛార్మీ మళ్ళీ ఫామ్ లోకి వస్తారని చాలా నమ్మకంగా ఉన్నారు.












