ప్రపంచం

Flight Accident : కుప్పకూలిన విమానం.. 10 మంది దుర్మరణం

రచన: Kumar2 నిమిషాల పఠనం

ఇటీవలి కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండ్రోజుల కిందట రన్నింగ్ విమానంలో కిటికీ డోర్ ఊడిపోవడంతో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు క్షేమంగా బయటపట్డాడు.

ఇటీవలి కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండ్రోజుల కిందట రన్నింగ్ విమానంలో కిటికీ డోర్ ఊడిపోవడంతో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు క్షేమంగా బయటపట్డాడు.సీట్ బెల్ట్ లేకపోతే నేరుగా బయటకు వెళ్లిపోయేవాడని తెలిసింది.గతంలో ఇండియాలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సుమారు 200లకు పైగా ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా పలు విమాన ప్రమాదాలు సంభవించాయి. కొన్ని విమానాలు అయితే కనిపించకుండాపోయాయి.తాజాగా, బహామాస్‌లో సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం కూలిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నాసావు నుంచి శాన్ ఆండ్రోస్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై ప్రధాని ఫిలిప్ బ్రేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీంతో ముందుజాగ్రత్త భద్రతా చర్యగా 'ఫ్లెమింగో ఎయిర్' విమాన సర్వీసుల లైసెన్స్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసి, దర్యాప్తునకు ఆదేశించింది. భద్రతాలోపం వల్లే ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తి ఉండవచ్చా? అని ఏవీయేషన్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

https://x.com/ChotaNewsApp/status/2075759199347486893?s=20

#flight Accident#crash#bahamas#10 killed#international
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి