తెలంగాణ

JOB NOTIFICATION: టీజీపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. !

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా మరో నియామక ప్రకటనను అభ్యర్థుల ముందుకు తెచ్చింది.

 రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా మరో నియామక ప్రకటనను అభ్యర్థుల ముందుకు తెచ్చింది. రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగంలో ఖాళీగా ఉన్న ఏడు టౌన్‌ప్లానింగ్ సహాయకుల (టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్) ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

 ఈ ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల (ఆగస్టు) 22వ తేదీని ఆఖరి గడువుగా ఖరారు చేశారు. కాగా, భర్తీ చేయనున్న మొత్తం ఏడు పోస్టుల్లో రెండు ఉద్యోగాలు రాష్ట్రస్థాయి కేడర్‌కు చెందినవి కాగా, మిగిలిన ఐదు పోస్టులు మల్టీజోనల్ కేడర్ కిందికి వస్తాయని టీజీపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది.

 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీ.ప్లానింగ్ లేదా బీటెక్ (ప్లానింగ్) విద్యార్హత పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ ఏడాది అక్టోబరు నెలలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు, నిబంధనలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి