సినిమా

Actress Sreeleela: రోజుకు అన్ని ల‌క్ష‌లా.. శ్రీలీల ఇన్‌స్టా సంపాద‌న తెలిస్తే షాకే.!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Actress Sreeleela: వెండితెరపై మెరుపులా మెరిసి, కుర్రకారు గుండెల్లో సునామీ సృష్టించిన కన్నడ బ్యూటీ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుని టాప్ లీగ్‌లోకి దూసుకెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అయితే, ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో ఈ అమ్మడికి కాస్త టైం బ్యాడ్ నడుస్తోందనే చెప్పాలి.

Actress Sreeleela: వెండితెరపై మెరుపులా మెరిసి, కుర్రకారు గుండెల్లో సునామీ సృష్టించిన కన్నడ బ్యూటీ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుని టాప్ లీగ్‌లోకి దూసుకెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అయితే, ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో ఈ అమ్మడికి కాస్త టైం బ్యాడ్ నడుస్తోందనే చెప్పాలి. 'ధమాకా', 'భగవంత్ కేసరి' లాంటి ఒకట్రెండు బ్లాక్‌బస్టర్స్ మినహా, ఈమె ఖాతాలో ఆశించిన స్థాయిలో భారీ హిట్లు పడలేదు. అయినప్పటికీ, ఈ బ్యూటీ డిమాండ్ కానీ, సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ కానీ అస్సలు తగ్గకపోవడం విశేషం.

సినిమా సక్సెస్‌లతో సంబంధం లేకుండా శ్రీలీల బ్రాండ్ వాల్యూ రోజురోజుకూ స్కై రాకెట్‌లా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మెరుపుతీగకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం దాదాపు 17 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది శ్రీలీల. ఈ భారీ ఫాలోయింగే ఇప్పుడు ఆమెకు కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ నెలకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వెనకేస్తోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని టాప్ బ్రాండ్స్ ప్రమోషన్ల కోసం శ్రీలీల రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెండితెరపై హిట్లు లేకపోయినా, డిజిటల్ స్క్రీన్‌పై మాత్రం ఈమె రేంజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో తన లక్‌ను కాపాడుకుంటూనే, తమిళ, హిందీ పరిశ్రమలపై కూడా కన్నేసింది ఈ కన్నడ కస్తూరి. అక్కడ కూడా భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టి పాన్ ఇండియా లెవెల్లో దుమ్మురేపాలని ప్లాన్ చేస్తోంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా, సోషల్ మీడియా ఇన్‌కమ్‌తో టాలీవుడ్ ముద్దుగుమ్మలకు శ్రీలీల గట్టి పోటీ ఇస్తోందని చెప్పక తప్పదు.

#actresssreeleela#sreeleela#sreeleelainstagramincome#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి