Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాను ప్రకటించవచ్చా? వారణాసి షూటింగ్‌కి త్వరలోనే ప్యాకప్ చెప్పేస్తున్నారా? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు టాకీపార్ట్ పూర్తి కావచ్చిందట. కొద్దిపాటి షూటింగ్ మినహా 85 శాతానికి పైగా షూట్ ఫినిష్ అయినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ వరకూ మహేష్ కి సంబందించిన షూట్ పూర్తి కానుండగా అక్టోబర్ చివరకికల్లా వారణాసి మొత్తం షూట్ కంప్లీట్ అవనుందని సమాచారం.
మహేష్ బాబు కెరీర్‌లోనే మొదటిసారి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. 1300 నుంచి 1400 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఎస్.ఎస్.కార్తికేయ, డా.కె.ఎల్.నారాయణ కలిసి నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే. వారణాసి మూవీలో మొత్తం 6 పాటలుండగా..ఆల్రెడీ 4 పూర్తి చేశాడు. ఇంకా 2 రెండు పాటలను కంపోజ్ చేస్తున్నారు. వీటిలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సమయంలో సంచారి సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక, పాత్ర సినిమా మొత్తం కంప్లీట్‌గా వీల్ చైర్‌లోనే ఉంటుందట. అలా, ఉండే సంచనాలను సృష్టిస్తాడని అర్థమవుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు పలు కారణాల వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడు, వారణాసి కూడా అలాగే జరుగుతుందనుకున్నారు.
కానీ, రాజమౌళి వారణాసి సినిమా విషయంలో మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా చక చకా షూటింగ్ చేసుకుంటు వస్తున్నారు. అంతేకాదు, గత కొన్ని రోజుల నుంచి హాలీవుడ్ మీడియాలో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ ద్వారా వారణాసి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. త్వరలో, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. అలాగే, ఈ నెలాఖరు కల్లా మహేష్ పార్ట్ కి సంబందించిన షూటింగ్ పూర్తి చేస్తారట. అలాగే, అక్టోబర్ వరకూ మొత్తం వారణాసి షూట్ కంప్లీట్ కానుంది. 2027, ఏప్రిల్ 7న 120 దేశాలలో రిలీజ్ కానుంది.












