Allu Arjun-Raaka: టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమాల పరంగా విజువల్ వండర్స్‌ను సృష్టిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్. ఒకప్పుడు ఇలాంటి వండర్స్‌ని చూడాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ హాలీవుడ్ సినిమా. కానీ, శంకర్ ఆ తర్వాత ఎస్ ఎస్ రాజముళి లాంటి వారు వచ్చాక మన తెలుగు సినిమాలే హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్నాయి. టెక్నాలజీతో మన వాళ్ళు వండర్స్ క్రియెట్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ విజువల్ వండర్ రాకా. తాజాగా, ఈ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది. ఒకేసారి 37 మందితో మోషన్ క్యాప్చర్ ద్వారా షూట్ చేయడం అనేది దర్శకుడు అట్లీ విజన్‌కి నిదర్శనం. ఇలాంటి, రేర్ రికార్డ్ మన సౌత్‌లో మొదటిసారి రాకాతో రావడం గొప్ప విషయం. రాకా అనేది ఒక అద్భుతమైన ప్రపంచం అని మేకర్స్ చెప్తున్నారు.
ఈ విజువల్ వండర్‌ని దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. దీపిక పడుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు రెండు వీడియోలను రిలీజ్ చేశారు. వాటిలో ఒకటి అల్లు అర్జున్‌ది కాగా..ఇంకోటి దీపిక పడుకొనేది. ఈ రెండు వీడియోలతో అట్లీ గ్యారెంటీగా మ్యాజిక్ చేయబోతున్నాడని మాట్లాడుకున్నారు. కానీ, దర్శకుడు శంకర్ రూపొందించిన రోబో, ఐ లాంటి విజువల్ వండర్స్‌ను మర్చిపోయేలా రాకాను తీసుకురాబోతున్నాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.
తాజాగా, ఈ సినిమాకి సంబందించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వందలమంది వీఎఫెక్స్ బృందం..అట్లీ విజన్ కి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నారు. అలాగే, ఒకేసారి 37మందిపై మోషన్ క్యాప్చర్ తో షూట్ చేయడం ఓ సంచలనం. అట్లీ హాలీవుడ్ సినిమాలకి మించి రాకాను రూపొందిస్తున్నాడని తాజాగా వదిలిన మేకింగ్ వీడియోతో అర్థమవుతోంది. సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో ఊహించుకోవడానికి ఛాన్స్ లేనంతగా తారా స్థాయిలో ఈ విజువల్ వండర్ తయారవుతోంది. ప్రస్తుతం, రాకా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో..యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది.












