దునియా

Ayodhya Ram Mandir: రామమందిరంలో 105 సార్లు చోరీ.. బట్టలు, జేబుల్లో దాచి ఎత్తుకెళ్లిన వైనం

రచన: Mahesh3 నిమిషాల పఠనం

Ayodhya Ram Mandir: కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన అయోధ్య రామాలయంలో కనీవినీ ఎరుగని మహాపరాధం వెలుగు చూసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో రాముడికి సమర్పించుకున్న కానుకలను కాపాడాల్సిన చేతులే స్వాహా చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది.

Ayodhya Ram Mandir: కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన అయోధ్య రామాలయంలో కనీవినీ ఎరుగని మహాపరాధం వెలుగు చూసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో రాముడికి సమర్పించుకున్న కానుకలను కాపాడాల్సిన చేతులే స్వాహా చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎదుట దిగ్భ్రాంతికర నిజాలను బయటపెట్టింది. మందిరంలో ఒకసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా 105 సార్లు పక్కా ప్లాన్‌తో విరాళాలను కొల్లగొట్టారన్న సంచలన వాస్తవాన్ని సిట్ ఆధారాలతో సహా కోర్టుకు నివేదించింది.

బట్టలు, షూలలో దాచి స్వాహా..

విరాళాల లెక్కింపు ప్రక్రియ కోసం నియమితులైన సిబ్బందే ఈ ఘరానా దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. హుండీ నగదును లెక్కించే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా సిబ్బంది తమ బట్టలు, జేబులు, చివరకు షూలలో సైతం కరెన్సీ నోట్లను దాచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించినట్లు వెల్లడించారు. పవిత్రమైన ఆలయంలో విరాళాల లెక్కింపు పేరిట జరిగిన ఈ దోపిడీ విజువల్స్ అన్ని కూడా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని సిట్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది.

సెప్టెంబర్ 25 నాటికి చార్జ్‌షీట్

ఈ పక్కా ఆధారాలతో చోరీకి పాల్పడ్డ నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు సిట్ వెల్లడించింది. మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే దానిపై సమగ్ర విచారణ తుది దశకు చేరుకుందని స్పష్టం చేసింది. ఈ చోరీకి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సెప్టెంబర్ 25 నాటికి అధికారికంగా చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. భక్తుల విశ్వాసాలను మంటగలుపుతూ రాముడి హుండీకే కన్నం వేసిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.

#Ayodhya Ram Mandir#Ram Mandir#Ayodhya#Ram Temple#Donation Theft#Temple Donations#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి