The Paradise: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కింది ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం (సెప్టెంబర్ 24) పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం, జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇక, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎ సర్టిఫికెట్‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్నందున ఈ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారికంగా “ఎ” సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ విషయాన్ని హీరో నాని స్వయంగా తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ‘ది ప్యారడైజ్’ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాపై దర్శకుడు శ్రీకాంత్, హీరో నాని భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టే, ట్రైలర్ లేకపోయినా కూడా అంచనాలు ఊహించని రేంజ్‌లో పెరిగాయి.
ఈ నేపథ్యంలోనే ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఉన్న ఆసక్తిని బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ నాని కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే, ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. ఇక, సిల్వర్ స్క్రీన్ మీద బొమ్మ పడి హిట్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్‌లోనే మ్యాజిక్ ఫిగర్స్‌ని టచ్ చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక, ఈ మూవీలో విలన్ ‘షికంజా మాలిక్’ రోల్ ను సీనియర్ నటుడు మోహన్ బాబు చేయడం విశేషం.

వీరితో పాటు రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్, సోనాలి కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ నటించింది. స్పెషల్ నంబర్‌లో కీర్తి సురేష్ అలరించబోతోంది. భారీ బడ్జెట్‌తో ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఎలాంటి సరికొత్త రికార్డ్స్ ని నమోదు చేతుందో చూడాలి.










