Official: ఇటీవల మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా విడుదల వాయిదా పడబోతుందని వార్తలు వచ్చాయి. ఇదే వార్తలు ఇంతకముందు పదే పదే వస్తుండటంతో నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి స్పందించాడు. డిసెంబర్ 3న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కన్‌ఫర్మ్ అని ఆయన ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఇన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలే నిజమయ్యాయి. ఇదే, నిర్మాత ఇప్పుడు ఫౌజీ కాస్త ఆలస్యం అవుతుందని రివీల్ చేశాడు.
తాజాగా, నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా కీర్తి ఆడిపాడిన 'ఏషనాగుల' ఫోక్ సాంగ్ నిలవబోతోంది. ఇక, మోహన్ బాబు విలన్ పాత్ర కూడా మేజర్ ప్లస్ పాయింట్‌గా ఉండబోతుంది. 7 భాషల్లో రిలీజ్ కాబోతున్న ప్యారడైజ్ సినిమా..ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డ్ స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి.
ఇక, విడుదలకి మరిన్ని రోజులే ఉన్న నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన రవి సినిమా భారీ హిట్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇదే, సందర్భంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలకి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇంకా, కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉన్నందున డిసెంబర్ 3న రిలీజ్ చేయలేకపోతున్నట్టుగా ప్రకటించారు.
అయితే, బాహుబలి ఎలా అయితే ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్‌లా నిలిచిపోయిందో..అలాగే, ఫౌజీ కూడా ఆయన కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ప్రామిస్ చేశాడు. దాంతో, ఇన్నిరోజులు ఫౌజీ వాయిదా పడుతుందన్న వార్తలే ఇప్పుడు నిజమయ్యాయి. మరి, మళ్ళీ కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. కాగా, ఈ సినిమా ద్వారా ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకుడు.








