Roshan Meka: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ మేక, యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘ఏమో ఏమో ఇది’. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది.
‘ఏమో ఏమో ఇది’ సినిమాను ఈ అక్టోబర్ 30నే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించడం విశేషం. వాస్తవానికి, అక్టోబర్ లో భారీ చిత్రాలున్నాయి.దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2 నుంచే మన టాలీవుడ్ మూవీస్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి. అక్టోబర్ 2న వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం రిలీజ్ కాబోతోంది. అలాగే, 15న జైలర్ 2, అక్టోబర్ 16న రణబాలి లాంటి సినిమాలున్నాయి.
అయినా కూడా ‘ఏమో ఏమో ఇది’ సినిమాను కూడా రిలీజ్ చేయాలనుకోవడం సాహసం అని చెప్పాలి. ఇక, దీనికి సంబంధించి ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లు రోషన్, ప్రీతి ముకుందన్ ప్రేమలో మునిగి తేలుతున్నట్టుగా ఉన్న ఈ క్యూట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక, ఈ సినిమాలోని లవ్ స్టోరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, థియేటర్స్‌లో కట్టిపడేస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందిస్తుండగా.. ఆకట్టుకునే పాటలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవల, సీనియర్ నటుడు అర్జున్ సర్జా నటించిన బ్లాస్ట్ సినిమాలో ప్రీ ముకుందన్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించి అదరగొట్టింది. ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ఇప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతోంది. అంతేకాదు, ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతుండం విశేషం.












