తెలంగాణ

అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతులు.. సాగునీటి విడుదల కోసం వేడుకోలు

రచన: NK2 నిమిషాల పఠనం

Gadwal Farmers: జోగులాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సాగునీటి కోసం మహిళా రైతులు అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కారు. జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయాలంటూ అదనపు కలెక్టర్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. కర్నూలు-గద్వాల రహదారిపై బైఠాయించారు. జూరాల కుడి కాలువ మీద ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులకు నీటిని విడుదల చేయాలని వారు ఆందోళనకు దిగారు. దాదాపు 5 గంటలుగా గద్వాల రహదారిపై నిరసన చేపట్టారు. పెద్దఎత్తున రైతులు రోడ్డెక్కడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

రోడ్డుపై బైఠాయించిన రైతులకు సర్ది చెప్పేందుకు అదనపు కలెక్టర్ మధు మోహన్ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అదనపు కలెక్టర్ కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు కొందరు మహిళా రైతులు. తమ పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే జూరాల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకున్నారు.

#Gadwal Farmers#Touches Legs#Gadwal Additional Collector#Irrigation Water#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి