తెలంగాణ

Ramya Rao: ఛార్జీలకు డబ్బులేని సంతోష్ రావుకు వేల కోట్లు ఎక్కడివి : రమ్యారావు

రచన: Mahesh4 నిమిషాల పఠనం

బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ఆస్తుల వ్యవహారంపై తాజాగా కల్వకుంట్ల రమ్యా రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రమ్యా రావు కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు కనీసం బస్సు ఛార్జీలకూ దిక్కులేని వ్యక్తి.. ఇప్పుడు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఎలా నిర్మించారంటూ నేరుగా ప్రశ్నలు కురిపించారు.

Ramya Rao: బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ఆస్తుల వ్యవహారంపై తాజాగా కల్వకుంట్ల రమ్యా రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రమ్యా రావు కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు కనీసం బస్సు ఛార్జీలకూ దిక్కులేని వ్యక్తి.. ఇప్పుడు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఎలా నిర్మించారంటూ నేరుగా ప్రశ్నలు కురిపించారు.

ఎలిగాన్స్ ఎంపీరియాలో ఫ్లోర్ల కొద్దీ ఆస్తులు

హైదరాబాద్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్ నానక్‌రామ్‌గూడ నడిబొడ్డున ఉన్న ‘ఎలిగాన్స్ ఎంపీరియా’ కమర్షియల్ బిల్డింగ్‌లో సంతోష్ రావు కుటుంబానికి భారీగా వాటాలున్నాయని రమ్యా రావు ఆరోపించారు. ఈ ప్రతిష్టాత్మక ఆఫీస్ కాంప్లెక్స్‌లోని పలు అంతస్తులు సంతోష్ రావు భార్య పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చదరపు అడుగులకే భారీ డిమాండ్ ఉన్న ఇలాంటి ప్రాంతంలో అంతస్తులకు అంతస్తులే ఎలా వారికి సొంతం అయ్యాయని ఆమె సూటిగా ప్రశ్నించారు.

ఛార్జీలకు లేని వ్యక్తికి ఇంత సంపద ఎలా వచ్చింది?

"ఒకప్పుడు హైదరాబాద్‌కి వస్తే ఇక్కడ కనీసం ఆటో, బస్సుల్లో తిరగడానికి కూడా ఛార్జీలకు సంతోష్ దగ్గర పైసలు ఉండేవి కావు. అలాంటి వ్యక్తి ఈరోజు నానక్‌రామ్‌గూడ వంటి ప్రైమ్ లొకేషన్‌లో అంత పెద్ద బిల్డింగ్‌లను ఎలా సొంతం చేసుకోగలిగారు? ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది?" అంటూ రమ్యా రావు ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Ramya Rao#Kalvakuntla Ramya Rao#Santosh Rao#Joginipally Santosh Rao#BRS#BRS Leader#Former MP Santosh Rao#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి