January-12-Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు(21.09.2026) కృతి శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా, ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చింది.
కృతి శెట్టి పాత్రకు సంబంధించిన ‘ఫస్ట్-లుక్’ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాలో ఆమె ‘దీపు’ పాత్రలో నటుస్తున్న విషయాన్ని తెలుపుతూ ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఇక, ఈ పోస్టర్‌లో కృతి శెట్టి గులాబీ రంగు కాంబినేషన్ తో కూడిన సంప్రదాయ లంగా ఓణిలో కనిపించడం బావుంది. గుడి నేపథ్యంలో పోజు ఇస్తూ కనిపించిన కృతి, చిరునవ్వుతో ఈ పోస్టర్‌కు హైలెట్ అనిపించేలా ఉంది.
అంతేకాదు, ఈ ఫస్ట్-లుక్ లో సినిమాలోని పాత్ర లుక్ ను ఎలివేట్ కూడా బాగా చేసింది. కాగా, సాహు గారపాటి, సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారని తెలుస్తోంది. వెంకీ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి నుంచి వచ్చిన చిత్రాల్లోని స్టోరీ కంటే కూడా ఈ స్టోరీ చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ప్రస్తుతం, ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం నవంబర్ లోపు ‘జనవరి 12 విడుదల’ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు టార్గెట్ పెట్టుకున్నాడు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంక్రాంతికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫుల్ గా టార్గెట్ చేసేలా కామెడీ, ఎమోషన్, యాక్షన్ కలగలిసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘జనవరి 12 విడుదల’ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో అనిల్ మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఇక, త్వరలో తన స్టైల్‌లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి.












