తెలంగాణ

గనులు, భూగర్భ వనరుల శాఖపై సీఎస్ సమీక్ష.. ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలకు ఆదేశం

రచన: NK5 నిమిషాల పఠనం

Sanjay Jaju: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ పనితీరు, పరిపాలన అంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై సీఎస్ సమగ్రంగా సమీక్షించారు. శాఖ పరిధిలోని ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

* గనులు, భూగర్భ వనరుల శాఖపై సీఎస్ సమీక్ష

* ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలకు ఆదేశం

* విజిలెన్స్ బృందాలతో నిరంతరం తనిఖీలు, దాడులు

* శాఖలో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం

* రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా సమర్థవంతమైన చర్యలు

Sanjay Jaju: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ పనితీరు, పరిపాలన అంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై సీఎస్ సమగ్రంగా సమీక్షించారు. శాఖ పరిధిలోని ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణ, తవ్వకాలపై కఠిన చర్యలు

శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు

అక్రమ ఇసుక రవాణ, అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా పని చేయాలి

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత సమర్థవంతంగా పని చేసేలా చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా సమన్వయంతో పని చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌ మెంట్) డీఎస్ చౌహాన్, ITE&C సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ మైన్స్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

#Telangana Chief Secretary#Sanjay Jaju#Review#Department of Mines and Geology#Illegal Sand Mining#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి