క్రీడలు

‘ఓడినా సంబురాలా..?’ పాక్ క్రికెట్ జట్టుపై వసీం అక్రమ్ ఫైర్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీరుపై, అభిమానుల వైఖరిపై ఆ దేశ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైఫల్యాలను మర్చిపోయి సగటు వ్యక్తిగత ప్రదర్శనలను గొప్పగా వేడుక చేసుకోవడం ఆటగాళ్లలోని, అభిమానులలోని నిరాశాజనకమైన మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించాడు.

 ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీరుపై, అభిమానుల వైఖరిపై ఆ దేశ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైఫల్యాలను మర్చిపోయి సగటు వ్యక్తిగత ప్రదర్శనలను గొప్పగా వేడుక చేసుకోవడం ఆటగాళ్లలోని, అభిమానులలోని నిరాశాజనకమైన మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించాడు. సిరీస్ ఓడిపోయినప్పుడు సిగ్గుతో ముఖం దాచుకోవాలి తప్ప విమానాశ్రయాల్లో సంబరాలు చేసుకోకూడదని తీవ్ర చురకలంటించాడు.

 ఈ పర్యటనలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగులతో, రెండో టెస్టులో 194 పరుగులతో, మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలై క్లీన్ స్వీప్‌నకు గురైంది. జట్టులోని ఆరుగురు క్రీడాకారులు, ఇద్దరు కోచ్‌లను మార్చినా ఫలితం లేకపోయింది. చివరి టెస్టులో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల బౌలర్ రజావుల్లా 4 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 81 పరుగులు చేయడంతో స్వదేశంలో అతనికి వేలాది మంది అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

 అయితే ఓటమి పాలైన జట్టులోని ఆటగాడికి ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వేలాది మందితో ఘనస్వాగతం పలకడాన్ని వసీం అక్రమ్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘3-0 తేడాతో వైట్‌వాష్ అయ్యాక కనీసం ముఖం దాచుకుని తిరగాలి. వ్యక్తిగత ప్రతిభ ఉంటే ఇంట్లో వేడుక చేసుకోవాలి గానీ, ఘోర ఓటమి తర్వాత ఇలా ఎయిర్‌పోర్టుల్లో స్వాగత సత్కారాలు చేయడం మన దిగజారిన ప్రమాణాలకు సంకేతం’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

 పాకిస్థాన్ క్రికెట్‌లో మార్పు కేవలం కెప్టెన్లు, కోచ్‌ల మార్పుతో సాధ్యం కాదని అక్రమ్ వ్యాఖ్యానించాడు. జట్టు వ్యవస్థలో, క్రీడాకారుల ఆలోచనా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తేనే అంతర్జాతీయ స్థాయిలో రాణించగలమని స్పష్టం చేశాడు. సగటు ప్రదర్శనలను మెచ్చుకునే ధోరణి వీడి గెలుపు పిచ్చి ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించాలని సూచించాడు.

#WasimAkram#PakistanCricket#PakVsEngTest#Razaullah#PakistanCricketBoard#CricketNews#WasimAkramComments#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి