అమ్మాయిలు, మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు బాధితులు భయపడి ఇలాంటి విషయాలను బయటకు వెల్లడించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేపటి రోజున నిందితులు మళ్లీ తమను, కుటుంబాన్ని టార్గెట్ చేస్తారనే భయంతో వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం.
తాజాగా బిహార్‌లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి పట్ల కొందరు దుండగులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఏకాంతంగా గడిపేందుకు ఓ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగా వారిని గమనించిన ఓ గుంపు వెంటాడి వేధింపులకు గురిచేసింది. ఓ వైపు అబ్బాయిని పట్టుకుని వేధించడంతో పాటు యువతిని సైతం అసభ్యంగా తాకుతూ రాక్షస ఆనందాన్ని పొందారు.ఈ ఉదంతాన్ని ఆ గుంపులోని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటన బిహార్‌లోని జమూయిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న జంటను టార్గెట్ చేసిన కొందరు దుండగులు.. వారిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.యువతి పట్ల అత్యంత అమానుషంగా ఘోరంగా ప్రవర్తించారు.యువతిని అసభ్యకరంగా తాకుతూ తీవ్ర వేధింపులకు గురి చేశారు.
ఓ వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి కాళ్లావేళ్లా పడితే అప్పుడు ఆ ప్రేమజంటను దుండగులు వదిలేసినట్టు తెలిసింది.యువతిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని యువతి బాయ్ ఫ్రెండ్ అడ్డుకోవడంతో ఆమెను విడిచిపెట్టినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. ఇప్పటివరకూ ఆ దుండగులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
అయితే, దుండగులను జముయ్-లఖీసరాయ్ రహదారి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా బిహార్ పోలీసులు గుర్తించారు.వాస్తవాలను పరిశీలించాలని జముయ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కూడా వీడియోను వీక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. కాగా, బిహార్‌లోని బీజేపీ ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.












