తెలంగాణ

TG : పోలీసు దిగ్భంధంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫాంహౌస్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. ధరణి మాటున గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా భూములు దోచుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సర్వే చేసి ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. ధరణి మాటున గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా భూములు దోచుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సర్వే చేసి ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో భూముల సర్వే కొనసాగుతోంది.

దీనికి తోడు అక్కడి దళిత రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ భూమి మీదే అని ప్రూవ్ చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఇవాళ కూడా ఎర్రవల్లి పరిసరాల్లో అధికారులు సర్వే చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే గత రెండ్రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవసాయ క్షేత్రాల వద్ద కాంగ్రెస్ ఎంపీలు, నేతలు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. గతంలో సత్యం లింగం రాజు భూములను 111 జీవో తెచ్చి కేటీఆర్ తనపేరిట మార్చుకున్నారని.. అందులోనే జన్వాడ ఫాంహౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక మాజీ మంత్రి హరీశ్ రావు కొండపోచమ్మ సాగర్ కోసం రైతుల నుంచి అతి తక్కవ ధరకు భూములు సేకరించారని..అందులోనే ఆయన వ్యవసాయక్షేత్రాన్ని నిర్మించుకున్నారని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌ల వద్ద నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే, మరో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫాంహౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

గత రెండు రోజులుగా వందలాది మంది పోలీసులు జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం బయట మోహరించి దిగ్బంధనం చేసినట్టు సమాచారం.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులను పంపి ప్రభుత్వ యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి ఫాంహౌస్ వద్ద పోలీసులు భారీగా ఎందుకు మోహరించారని ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.

#BRS#jagadishreddy#farmhouse#police#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి