తెలంగాణ

Viral : కన్నం వేసిన ఇంట్లో దొంగ జల్సా.. రెండ్రోజులు హాయిగా!

రచన: Kumar4 నిమిషాల పఠనం

దొంగలు ఇటీవలి కాలంలో కొన్ని విచిత్ర పనులు చేస్తూ దొరికిపోతున్నారు.దొంగతనం చేసే క్రమంలోనే వారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చోరీకి వెళ్లిన దొంగ సాధారణంగా ఇంట్లో ఉన్నవి ఊడ్చేసి ఆ వెంటనే పరార్ అవుతాడు. కానీ, కొందరు ఈ మధ్యకాలంలో దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడి జల్సాలు చేస్తున్నట్టు సమాచారం.

దొంగలు ఇటీవలి కాలంలో కొన్ని విచిత్ర పనులు చేస్తూ దొరికిపోతున్నారు.దొంగతనం చేసే క్రమంలోనే వారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చోరీకి వెళ్లిన దొంగ సాధారణంగా ఇంట్లో ఉన్నవి ఊడ్చేసి ఆ వెంటనే పరార్ అవుతాడు. కానీ, కొందరు ఈ మధ్యకాలంలో దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడి జల్సాలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు ఇంట్లో ఉన్న మందు బాటిళ్లు తాగి అక్కడే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. మరికొందరు కిచెన్‌లోకి చొరబడి ఇంట్లోని ఫుడ్ ఐటమ్స్ తేరగా లాగించేస్తున్నారు.

అనంతరం బంగారం,సిల్వర్,నగదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వంటివి పట్టుకుని వెళ్లిపోతున్నారు. అయితే, ఓ దొంగ మాత్రం ఇంటికి తాళం ఉన్న విషయాన్ని గమనించి చొరబడ్డాడు. అనంతరం ఇంట్లోని వస్తువులు అన్ని కలెక్ట్ చేసి మూటగట్టాడు. ఆపై వాటిని తీసుకుని పారిపోకుండా రెండ్రోజుల పాటు అదే ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈ షాకింగ్ చోరీ ఘటన గురించి బయటకు తెలియడంతో అంతా నవ్వుకున్నట్టు తెలుస్తోంది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి దొంగ ఇంట్లోనే రెండ్రోజులు ఫ్యాన్, లైట్ వేసుకుని హాయిగా నిద్రపోయినట్టు తెలిసింది. ఆదివారం ఉదయం ఇంటికొచ్చిన యజమానులు మంచంపై హాయిగా పడుకున్న దొంగను చూసి నివ్వెరపోయినట్టు సమాచారం. ఇంటి యాజమానుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఇంట్లోని సామగ్రి ఏమైనా పోయాయా? అని తనిఖీలు చేయగా అన్ని సురక్షితంగానే ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. దొంగను బయటకు తీసుకుని రాగా ముందు షాక్ అయిన స్థానికులు.. ఆ తర్వాత నవ్వుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి ఓనర్ల ఫిర్యాదు ఆధారంగా ఆ దొంగను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచిన బుచ్చిరెడ్డి పాలెం పోలీసులు.. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది.

#theif#andrapradesh#caught#police#slept in home#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి