క్రైమ్

Crime : అంబర్‌పేటలో విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య

రచన: Kumar4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ప్రాణాలు తీసుకున్నాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పోలీసు డిపార్ట్మెంట్‌లో చేస్తూ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. అంబర్‌పేట్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ముత్తె చంద్రశేఖర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసిన కానిస్టేబుల్..అనంతరం ఉరేసుకున్నాడు. తాను ఉరివేసుకుని చనిపోవాలని అనుకుంటున్నట్టు సదరు యువతికి ముందే చెప్పినట్టు తెలిసింది. భయాందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వారు మలక్‌పేట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకునేలోపే చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. లోపలి నుంచి గడియ పెట్టుకుని కానిస్టేబుల్ ఉరివేసుకున్నట్టు మలక్ పేట పోలీసులు నిర్దారించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సమాచారం.

కానిస్టేబుల్ చివరగా వీడియో కాల్ చేసి మాట్లాడిన యువతిని విచారించి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలే కారణమా? లేదా ఉన్నతాధికారులు వేధింపులు ఏమైనా దీనికి కారణమా?అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ మరణవార్త విని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

#constable suicide#hyderabad#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి