తెలంగాణ

HYD : హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం బంద్.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హైటెన్షన్

రచన: Kumar4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వినాయకతి చవితి పండుగ సందర్భంగా ప్రతిష్టించిన విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచే ప్రారంభం అవ్వగా.. తాజాగా జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంతో గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ మహానగరంలో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వినాయకతి చవితి పండుగ సందర్భంగా ప్రతిష్టించిన విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచే ప్రారంభం అవ్వగా.. తాజాగా జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంతో గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే చారిత్రక ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధిస్తూ అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన ఉత్సవ సమితి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు రణరంగంలా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాల కోసం ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని సమాచారం.

దీంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్ వద్ద "నిమజ్జనం నిషేధం" అని ఉన్న బ్యానర్లను ఉత్సవ సమితి సభ్యులు చించివేశారు. జీహెచ్‌ఎంసీ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు.దీంతో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఉత్సవ సమితి నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఉత్సవ సమితి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎంఐఎం ఆదేశాల మేరకు అధికారులు రజాకార్ పాలనను అమలు చేస్తున్నారని ఆరోపించారు. నిమజ్జనాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయని పక్షంలో ఉత్సవ సమితి తరఫున తామే స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను చూసుకుంటామని వెల్లడించారు.

హుస్సేన్ సాగర్‌లో వందల ఏండ్లుగా సాగుతున్న గణేష్ నిమజ్జనాలను అడ్డుకోవడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, ప్రభుత్వం నిమజ్జన ఊరేగింపును, నిమజ్జనాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హెచ్చరికలు జారీ చేసింది.

#hyderabad#imersion#ganapathi#swechaanews#no entry boards
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి