తెలంగాణ

దానం పిటిషన్‌పై కీలక అప్‌డేట్.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం విచారణ జరపనుంది.

 తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం విచారణ జరపనుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించి, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని పక్కనబెట్టి హైకోర్టు దానంను అనర్హుడిగా ప్రకటించిందని వివరించారు.

 దీనిపై తక్షణమే విచారణ చేపట్టకపోతే ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినాలని, ఇప్పటికే కేవియట్ దాఖలు చేశామని అభ్యంతరం తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బుధవారానికి విచారణను వాయిదా వేసింది.  ఈ పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 ఒకవేళ సుప్రీంకోర్టు నుంచి దానం నాగేందర్‌కు ఎలాంటి మధ్యంతర ఉపశమనం (స్టే) లభించకపోతే, ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే ముందస్తు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా, తమ బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి.

 మరోవైపు అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చే తీర్పుపైనే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తుతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక లెక్కింపు ఆధారపడి ఉండటంతో అందరి దృష్టి సుప్రీంకోర్టు విచారణపైనే నెలకొంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, 2024 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడంతో సెప్టెంబర్ 18న హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసి స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

#DanamNagender#SupremeCourt#TelanganaPolitics#KhairatabadBypoll#TelanganaHighCourt#AntiDefectionLaw#BRS#Congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి