తెలంగాణ

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిబంధనల సడలింపు

రచన: NK3 నిమిషాల పఠనం

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులతో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిబంధనలు సడలించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకు సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై బేస్‌మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి (వన్ టైమ్ క్లియరెన్స్) ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.

ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో L3 మంజూరులకు దీనిని ప్రాతిపదికగా పరిగణించరాదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదే విధంగా ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభం కాని వాటిని రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

#Indiramma Illu#Indiramma Housing Scheme#Ponguleti Srinivas Reddy#Funds#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి