Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమా నుంచి అప్పుడెప్పుడో వచ్చిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్ గ్లింప్స్..ఆ సమయంలో వచ్చిన సంచారి సాంగ్..మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్‌ల లుక్స్ తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత మహేష్ బర్త్ డేకి టీజర్ వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ, అది జరగలేదు. కానీ, తాజా సమాచారం మేరకు దసరా నుంచి వరుస అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారట.
రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్స్ ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే. ప్రమోషన్స్ కోసమే కోట్లు ఖర్చు చేస్తారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి..అన్నీ ప్రాంతాల్లో ప్రధాన తారాగణంతో ఇంటర్వ్యూలు..ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి తారక్, చరణ్ అలిసిపోయినా వదల్లేదు. అలాంటిది, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా అంటే అన్నీ దేశాలను చుట్టేయడం కన్‌ఫర్మ్ అని తెలుస్తోంది.
అయితే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న దాని ప్రకారం షూటింగ్ 90 శాతం పూర్తైందట. ఇప్పటికే, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మొదలుపెట్టారు. జనవరి వరకూ మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్ చేసి రీరికార్డింగ్ మొదలుపెట్టనున్నారట. కనీసం 2 నుంచి 3 నెలల పాటు అన్నీ దేశాలలో వారణాసి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ దసరా నుంచి తెలుగులో ఈ చిత్రానికి సంబందించిన వరుస అప్‌డేట్స్ ఇవ్వాలని రాజమౌళి రెడీ అవుతున్నారట.
ఎస్.ఎస్.కార్తికేయ, డా.కె.ఎల్.నారాయణ దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాను 120 దేశాలలో 50 భాషలలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు, కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే 350 కోట్ల బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. మొత్తంగా 5000 కోట్ల బిజినెస్ అయ్యేలా హాలీవుడ్‌ని మించే సినిమాను ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక, వారణాసి ఓ విజువల్ వండర్‌గా మన ముందుకు తీసుకురానున్నాడు. అంతేకాదు, ప్రపంచ దేశాలు కూడా నివ్వెరబోయోలా వారణాసి ఉండబోతుంది. మరి, ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ రాబడుతుందో..ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.









