తెలంగాణ

22A Row: 22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది-మంత్రి పొంగులేటి

రచన: NK5 నిమిషాల పఠనం

22A Row: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22ఏ అంశంపై మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. నిషేధిత భూముల జాబితా (22ఏ) కొత్తగా వచ్చింది కాదని, గతంలో ఉన్నదేనని మంత్రి పొంగులేటి తెలిపారు.

22A Row: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22ఏ అంశంపై మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. నిషేధిత భూముల జాబితా (22ఏ) కొత్తగా వచ్చింది కాదని, గతంలో ఉన్నదేనని మంత్రి పొంగులేటి తెలిపారు. 22ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కాదన్నారు. 27ఏళ్ల క్రితమే 1999లో ప్రభుత్వ భూములను కాపాడేందుకు 22ఏ తీసుకొచ్చారని వెల్లడించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే 22ఏ

ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తే ఆనాడు 22ఏ అంశం వచ్చిందని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రభుత్వ భూములను బలమున్న వ్యక్తులు కొల్లగొట్టకుండా సురక్షితంగా ఉండాలంటే ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలనే ఆలోచన 27ఏళ్ల క్రితమే మొదలైందన్నారు మంత్రి పొంగులేటి. 2007లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు అది కంటిన్యూ అయ్యిందని తెలిపారు.

2009లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 22ఏ ఏర్పాటు

2007 తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ 22ఏ ఉండొద్దని నిషేధించాయని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ 2009లో మన హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 22ఏని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 22ఏ ఏర్పాటు చేసిన తర్వాత 2009, 2010 నుంచి 2015 వరకు హైకోర్టులో సుమారు 2వేల కేసుల దాకా అప్పీల్ చేసుకున్నారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అక్రమంగా తమ భూములను 22ఏలో పెట్టారని కోర్టులో అప్పీల్ చేసుకున్నారని తెలిపారు. 2015లో 22ఏ పై హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందన్నారు. రెండేళ్ల వరకు 22ఏపై విధివిధానాలు తీసుకురాలేదన్నారు. 2017లో విధివిధానాలు తెచ్చారని మంత్రి తెలిపారు.

అర్ధరాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు

రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ రెవెన్యూ శాఖను తన దగ్గరే ఉంచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని, పోర్టల్‌పై ఉన్న నియంత్రణను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. పోర్టల్‌లో వచ్చిన తప్పుల కారణంగా లక్షలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారని, వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారని పొంగులేటి వాపోయారు. కాగా, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

#22A#Ponguleti Srinivas Reddy#Brs#Congress#Telangana Assembly#Kcr#Dharani#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి