సినిమా

Srikanth Odela: ఏషనాగుల సాంగ్ గురించి దర్శకుడేమన్నాడంటే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల..ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కారణం హైదరాబాద్-సికిందరాబాద్ నేపథ్యంగా ది ప్యారడైజ్ అనే టైటిల్‌తో సినిమా చేస్తుండటమే. హైదరాబాద్ మహా నగరానికి ఎంతో పేరుంది. కానీ, ఎవరికీ దీన్ని కేంద్ర బిందువుగా చేసుకొని సినిమా చెయ్యాలని ఆలోచన రాలేదు. శ్రీకాంత్ కి వచ్చింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరి చూపు ఉంది.

తాజాగా, ఈ సినిమాకి సంబందించిన ప్రెస్స్ మీట్‌ని నిర్వహించారు. ఇందులో, దర్శకుడు శీకాంత్ గురించి నాని చెప్పిన మాటలు వింటే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. అంతగా పొగడ్తలతో ముంచేశాడు. ఇక, ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు ఒళ్ళు ఊహనం అయ్యేలా కష్టపడ్డారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక, ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబులది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.

అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా తెలంగాణ ఫోక్ సాంగ్ "ఏషనాగుల కట్టమీద" అంటూ స్పెషల్ నంబర్‌ను ప్లాన్ చేశారు. ఈ పాటలో నానితో కలిసి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులేసింది. ఆట సందీప్ మాస్టర్.. ఆయన భార్య ఈ సాంగ్‌కి డాన్స్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాట ఉందని తెలిసినప్పుడు అయినంత ఎగ్జైట్‌మెంట్ విడుదల తర్వాత లేదు. కారణం..ఇలాంటి పాటకి కావాల్సిన ఊపు..స్టెప్పులు ఏమాత్రం లేకపోవడమే. ఇదే, అందరూ అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో తాజాగా శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చాడు. పాటలో డాన్స్ అందరూ కావాలనుకున్నంత స్పీడ్ లేదని ఒప్పుకున్న ఆయన..నేనే ఇలాంటి డాన్స్ మూవ్‌మెంట్స్ కావాలని కొరియోగాఫర్స్‌కి చెప్పినట్టుగా తెలిపాడు. సాంగ్ ఇలాగే ఉండాలని డిసైడ్ చేసింది నేనే అన్నాడు. జనరల్‌గా మాస్ సాంగ్ అంటే ఊపున్న స్టెప్స్..డప్పుల మోతా ఉంటుంది. కానీ, ఏషనాగుల పాట ఒక పెళ్ళి బరాత్‌లో ఉండేలా సింపుల్‌గా స్లోగా స్టెప్స్ ఉండాలనుకున్నా..అందుకే..సాంగ్ అవుట్‌పుట్ ఇలా ఉందని తెలిపాడు. మరి, ఈ సాంగ్ వ్యూస్‌లో దుమ్ము దులిపింది. థియేటర్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

#Srikanth Odela#Yeshanagula Song#Nani#Kayadu Lohar#Keerthy Suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి