Meenakshi Chaudhary: కొంతమంది హీరోయిన్స్‌కి హిట్స్ వస్తున్నా ఎందుకనో ఆశించిన విధంగా అవకాశాలు రాకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు హాట్ బ్యూటీస్‌లో మీనాక్షి చౌదరి పరిస్థితి ఇలాగే ఉంది. హిందీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కి వచ్చింది మీనాక్షి. ఇక్కడ అప్పుడొకటి అప్పుడొకటి అన్నట్టుగా సినిమాలు చేసింది. ఇప్పుడు, చేస్తున్న సినిమా ఒక్క వృష కర్మ మాత్రమే. దీని తర్వాత మీనూ పరిస్థితేంటీ? అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ.
"ఇచట వాహనములు నిలుపరాదు"..అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాతో పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ పరంగా బాగానే ఆకట్టుకుంది. దాంతో, రవితేజ సరసన ఖిలాడి సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా ఫ్లాపైంది. దీని, తర్వాత హిట్: ది సెకండ్ కేస్ లో నటించి హిట్ కొట్టింది. అయితే, ఇక్కడే మీనాక్షి రాంగ్ సెలక్షన్ చేసుకుంది. త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ లీడ్ అని మోసపోయింది. ఆ సినిమానే 'గుంటూరు కారం'.
ఇక, తమిళంలో విజయ్ సరసన 'గోట్' సినిమాలో నటించింది. ఇందులో హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది. సినిమా కూడా యావరేజ్‌గా ఆడింది. కానీ, మళ్ళీ అక్కడ్నుంచి తమిళంలో సాలీడ్ అవకాశాలంటూ ఏవీ రాలేదు. కానీ, తెలుగులో మట్కా, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒకరాజు సినిమాలు చేసింది. వీటిలో మట్కా, మెకానిక్ రాకీ డిసప్పాయింట్ చేయగా..మిగతా మూడు సినిమాలు హిట్‌గా నిలిచాయి.
కానీ, ఇప్పుడు మీనూ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృష కర్మ. ఇందులో, తనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువే దొరికిందని టాక్ ఉంది. అంతేకాదు, ఈ సినిమాతో పాన్ ఇండియా స్కేల్‌లో హిట్ గ్యారెంటీ అంటున్నారు. నిజంగా, అదే జరిగితే మీనూ పాపకి తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా మంచి అవకాశాలే దక్కుతాయి. మరి, వృష కర్మ మీనాక్షికి ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.










