క్రైమ్

crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి లేదని తెలిసి ఒంటరిగా ఫీలయిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది . మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక 19 ఏళ్ల ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.

వివరాల్లోకివెళితే.. పెద్దశంకరం పేటకు చెందిన బేతమ్మ(45) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లింది.అక్కడ వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. అయితే, నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బేతమ్మ హైదరాబాద్‌లో తను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.

https://x.com/pulsenewsbreak/status/2098649939438166184?s=20

తల్లి మరణవార్తను విన్న కొడుకు తట్టుకోలేకపోయాడు. తల్లి లేనిదే తాను ఉండలేనని నిర్ణయానికి వచ్చాడు. దీంతో కొలపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.హైదరాబాద్ నుంచి బేతమ్మ మృతదేహాన్ని సైతం గ్రామానికి తరలించినట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

#mother#son#suicide#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి