తెలంగాణ

Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు

రచన: NK4 నిమిషాల పఠనం

Kavitha: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం 22ఏ. రాజకీయాలన్నీ 22ఏ నిషేధిత జాబితా చుట్టే తిరుగుతున్నాయి. తమ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. 22ఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. 22ఏ పేరుతో తెలంగాణలో దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.

Kavitha: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం 22ఏ. రాజకీయాలన్నీ 22ఏ నిషేధిత జాబితా చుట్టే తిరుగుతున్నాయి. తమ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. 22ఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. 22ఏ పేరుతో తెలంగాణలో దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. వెంటనే నిషేధిత జాబితా నుంచి పేదల భూములు తొలగించాలని బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎక్కువ అక్రమాలు

తాజాగా ఇదే అంశంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత స్పందించారు. అయితే ఆమె బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 22ఏ పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేస్తుందో అంతకంటే ఎక్కువ అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్ రావు స్కామ్ చేశారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి 100 ఎకరాలను హరీశ్ రావు తన తండ్రి పేరు మీదకు బదలాయించుకున్నారని కవిత చెప్పారు.

సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు

22ఏ నిషేధిత జాబితా నుంచి తీసుకుని సిద్ధిపేట పట్టణంలో 100 ఎకరాలు హరీశ్ రావు తన తండ్రి పేరు మీద బదలాయించుకున్నారన్న కవిత.. అందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని రేవంత్ ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే దానిపై చర్చ పెట్టాలని, హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్, పొంగులేటికి సవాల్

గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసి ఒకరినొకరు కాపాడుకుంటున్న పరిస్థితి ఉందని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా. నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా గుంపు మేస్త్రీకి, గుంటనక్కకు ఎలాంటి అండర్ స్టాడింగ్ లేకపోతే ఈ వ్యవహారాన్ని బయటపెట్టండి అని కవిత డిమాండ్ చేశారు.

#Kavitha#Trs#Brs#Harish Rao#22A Prohibited Lands#Telangana#Congress#Swechaa News#Siddipet
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి