తెలంగాణ

TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కులాంతర వివాహాం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని కొందరు దుండగులు కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కులాంతర వివాహాం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని కొందరు దుండగులు కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘రేవంత్ పాలనలో ఎస్సీలపై మరో ఘోరం. గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్ ప్రేరేపణతో కొందరు దుండగులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది అమానవీయ సంఘటన. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నేరం. అందరు బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.

ఇది కులాంతర వివాహం అని తెలిసినా, మేజర్ అయిన అమ్మాయి తాను ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నాను అని పోలీసులకు తెలిపినా వాళ్లు ఈ జంటకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించలేకపోయారు! ఆ బాధిత యువతి సర్పంచ్ కుట్రతోనే ఈ విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్పినా FIR లో ఎందుకు చేర్చడం లేదు, రేవంత్ రెడ్డి గారు?

దళితులపై నకిలీ ప్రేమ చూపించడం కాదు, వారి ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి.స్పీకర్ గారు, దీని మీద అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేయించాలని కోరుతున్నాను.ఈ పేద కుటుంబాల కన్నీళ్లను కూడా తుడిచే బాధ్యత తీసుకోండి’ అని కోరారు. ఇదిలాఉండగా, కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడి ఇంటిని కూల్చివేయడంపై దళిత సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

https://x.com/RSPraveenSwaero/status/2098731183056236980?s=20

#Rs praveen kumar#intercast marriage#sc boy#home demolish#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి