దునియా

Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Modi - Jinping : ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, భారత్ - చైనా సంబంధాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.

Modi - Jinping : ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, భారత్ - చైనా సంబంధాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా భారత్‌తో కలిసి నడవాలంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి.

"మోడీని 21 సార్లు కలిశా.. నా బర్త్‌డే నాడే భారత్ ఆహ్వానం"

సమావేశం అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అతిపెద్ద దేశాలైన భారత్, చైనా పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. "ప్రధాని మోడీని ఇప్పటివరకు నేను 21 సార్లు కలిశాను. ఇరు దేశాల సంబంధాలను స్థిరమైన అభివృద్ధి పథంలోకి నడిపించాం. ఒకరి సామర్థ్యాల నుంచి మరొకరు నేర్చుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉమ్మడిగా పురోగతి సాధించాలి" అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఈ సదస్సుకు సంబంధించి తన పుట్టినరోజు నాడే భారత్ నుంచి ఆహ్వానం అందిందన్న ప్రత్యేక జ్ఞాపకాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం ఇరు దేశాల మధ్య నెలకొన్న సానుకూల వాతావరణానికి అద్దం పడుతోంది.

దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాలకు డ్రాగన్ గ్రీన్ సిగ్నల్

కేవలం మాటలకే పరిమితం కాకుండా, భారత్‌తో దీర్ఘకాలిక, వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు ప్రకటించడం అత్యంత కీలక పరిణామం. ప్రధానంగా ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యగా మారిన సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక వాణిజ్య లోటు, టెక్నాలజీ రంగాల్లో సహకారం తదితర కీలక అంశాలపై మోడీ, జిన్‌పింగ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆసియాలోని రెండు అగ్రరాజ్యాలు చేతులు కలిపితే అంతర్జాతీయ వాణిజ్య ముఖచిత్రమే మారిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సమ్మిట్‌కు చైనా మద్దతు.. మోడీ థాంక్స్!

భారత్ అధ్యక్షతన జరుగుతోన్న బ్రిక్స్ సదస్సుకు చైనా అందించిన తిరుగులేని మద్దతు, సహకారానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, బలోపేతానికి నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మోడీ తేల్చిచెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు ముగింపు పలికి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా సాగిన మోడీ - జిన్‌పింగ్ భేటీ భవిష్యత్ ప్రపంచ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

#Modi Jinping#Narendra Modi#Xi Jinping#India China Relations#BRICS Summit#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి