Varanasi: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేశ్ కి జంటగా నటిస్తోంది. గ్లోబ్ ట్రాటర్ అంటూ ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ సమయంలో రిలీజ్ చేసిన విజువల్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఒక్క దెబ్బతో, మహేశ్ సినిమాపై అంచనాలు గ్లోబల్ వైడ్ గా పెరిగాయి. ఇందులో, రుద్ర పాత్రలో మహేశ్, మందాకిని పాత్రలో ప్రియాంక కనిపించబోతున్నారు. అంతేకాదు, మహేశ్ బాబు..శ్రీరాముడి అవతారంలోనూ దర్శనమిచ్చి సర్‌ప్రైజ్ చేయనున్నాడు. 2027 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
అయితే, నేడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈ సందర్భంగా వారణాసి సినిమా నుంచి ఆమె లుక్ ని జక్కన్న టీమ్ రిలీజ్ చేసింది. అంతేకాదు, "ఆమె నవ్వితే అందం..నవ్వకపోతే నిప్పు కణిక".. అంటూ ట్వీట్ చేశాడు. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా "మా ఒకే ఒక్క మందాకిని" కి బ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం, ఈ రెండు ట్వీట్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

కాగా, పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కథ రాజమౌళి తండ్రి వి విజయేంద్రప్రసాద్. మాటలు..దర్శకరచయిత దేవాకట్ట. ఈ ఏడాది అక్టోబర్ వరకూ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే, ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారట. 2027, ఏప్రిల్ లో పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.












