తెలంగాణ

Rains : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణగా వర్షాలు కురవడం లేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు సుమారు 60 శాతం తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. వారు హెచ్చరించిన విధంగానే దేశవ్యాప్తంగా వర్షాలు లేవు.

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణగా వర్షాలు కురవడం లేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు సుమారు 60 శాతం తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. వారు హెచ్చరించిన విధంగానే దేశవ్యాప్తంగా వర్షాలు లేవు. జులై మాసం ముగియడానికి వస్తున్నా వర్షాలు కానరావడం లేదు. ఉత్తర తెలంగాణలో ఆడపాదడపా వర్షాలు వచ్చి వెళ్తున్నా.. దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న జిల్లాల్లో అసలు వర్షం జాడనే కరువైంది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి.

వర్షాలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు.మరోవైపు సాగు,నీటి ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది. ఇదిలాఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడన ప్రభావమే ఇందుకు కారణమని తెలిపింది. ద్రోణి బలపడితే రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

నేడు హైదరాబాద్‌లో కూడా చిరు జల్లులు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడతాయని ముందస్తు సూచనలు చేసింది.ఇక ఏపీలో కూడా వర్షాలు భారీగా పడతాయని తెలిపింది. ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. తీరప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

#Rains#Ap&Telangana#forecast#whether report
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి