ఏపీ

Ap : బోల్తా కొట్టిన ‘పల్లెవెలుగు’.. బస్సులోనే విద్యార్థులు, ప్రయాణికులు

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా..

ఏపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకివెళితే.. కామేపల్లి నుంచి ఒంగోలు వెళ్లే మార్గంలో ద్వారకా సీఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి పల్లెవెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మంది పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

https://x.com/TeluguScribe/status/2078343172359598445?s=20

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి బస్సు డ్రైవర్ పరారైనట్టు సమాచారం. ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని.. ఎదురుగా బస్సు వస్తున్నదని తెలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే బస్సు పల్టీ కొట్టిందని కొందరు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నారని తెలిసినా జాగ్రత్త వహించలేదని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

#apsrtc#bus#rollover#prakasham#students#passengers#injured
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి