NTR-Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం 'డ్రాగన్'. కాంతార 1 ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. డ్రాగన్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబందించిన చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ ని నిర్మించారు.
దీనిలోనే ఇప్పుడు నైట్ షెడ్యూల్ జరుగుతోంది. హీరోహీరోయిన్లు ఎన్టీఆర్- రుక్మిణి వసంత్ లపై ఈ నైట్ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన మార్క్ సిగ్నేచర్ స్టైల్ 'డార్క్ టోన్' అంటే చీకటి నేపథ్యం ని ఈ మూవీలోనూ వదల్లేదు. డ్రాగన్ కోసం తెరకెక్కుతున్న ఈ నైట్ షెడ్యూల్‌లో అదే డార్క్ సీన్లను ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ సినిమాలలోని డార్క్ బ్యాగ్డ్రాప్ వల్లే ప్రశాంత్ నీల్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
ఈ మూడు సినిమాల్లో విపరీతమైన రక్తపాతం, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఈ విజువల్ థీమ్‌ను ఎంచుకొని మెప్పించాడు. అయితే, 'డ్రాగన్' సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు కూడా ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ థీమ్‌ను, చీకటిని అద్భుతంగా వాడుతున్నాడట. ముఖ్యంగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి వసంత్ కెరీర్‌కు ఈ రోల్ మైల్ స్టోన్ గా మిగులుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి జంటగా నటిస్తూ, ప్రశాంత్ నీల్ మార్క్ ఎమోషనల్ డ్రామాలో ముఖ్యమైన భాగం కావడంతో రుక్మిణి నటనకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయట. రుక్మిణి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కాంతా 1 మూవీలో కంటే ఇంకా, పవర్‌ఫుల్ ఎమోషన్స్ తో ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి, డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ ల మధ్య వచ్చే ఈ డార్క్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.












