కొనుగోలు దారులకు బంగారం లాంటి వార్త.. పసిడి ధరలు మరోసారి దిగివచ్చాయి.ఆషాఢం సేల్ నడుస్తుండగా గోల్డ్ ప్రియులకు నిజంగానే ఇది శుభవార్త అని చెప్పవచ్చు. వచ్చేనెల నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. వివాహాలు, ఫంక్షన్లు భారీగా ఉండటంతో బంగారం కొనుగోలుపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
ధరలు కూడా తగ్గుముఖం పట్టడం వ్యాపారులకు, అటు కస్టమర్లకు సైతం కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలే అందుకు కారకంగా తెలుస్తోంది. ముఖ్యంగా వెండి ధర భారీగా పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా రూ.5,000 మేర భారీగా తగ్గింది. దీంతో కిలో వెండి ప్రస్తుతం రూ.2,35,000కు చేరుకుంది.
ఇదే నెల మొదటి వారంలో వెండి ధర గరిష్టంగా రూ.2,60,000 మార్కును తాకిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల వ్యవధిలోనే ధరలు దిగిరావడంతో వినియోగదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వెండి బాటలోనే బంగారం ధరలు సైతం తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల నిజమైన బంగారం 10 గ్రాముల ధరపై రూ.760 తగ్గి ప్రస్తుతం రూ. 1,42,530 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.700 మేర తగ్గి ప్రస్తుతం రూ. 1,30,650కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు కాస్త తగ్గుముఖం పట్టడం వల్లే ధరలు తగ్గుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.












