Bhagyashri Borse: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్టే ప్రధానం. ఆ ఒక్క హిట్టే దర్శకుడినైనా, హీరోనైనా, హీరోయిన్‌నైనా నిలబెడుతుంది..లేదా పడగొడుతుంది. హీరోలు కోట్లలో రెమ్యునరేషన్‌తో పాటు లాభాలలో వాటాలను తీసుకుంటున్న రోజులివి. అలాగే, హీరోయిన్స్ కూడా ఓ హిట్ పడిందంటే అమాంతం రెట్టింపు స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.
దీనిలో, ఏ ఒక్కరినీ తప్పు పట్టడానికి లేదు. కలిసి వచ్చినప్పుడే జాగ్రత్తపడాలి..నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి. అంతే ఇండస్ట్రీ అంటే. రెండు ఫ్లాపులు పడితే ఐరెన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. కాబట్టే, మన వాళ్ళు కూడా ఛాన్స్ వస్తే డిమాండ్ చేస్తుంటారు. బక్కపలచని బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా ఇప్పుడు తన రెమ్యునరేషన్ పెంచేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
లెనిన్ సినిమాకి ముందు ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ బ్యూటీకి హిట్ పడింది లేదు. కాబట్టే, కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకూ రెమ్యునరేషన్ తీసుకునేదట. కానీ, జూలై 10వ తేదీన రిలీజైన లెనిన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో, ఇప్పుడు కొత్తగా ఒప్పుకునే సినిమాకి 2.5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. నిర్మాతలు కూడా భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ కి, అందానికి అదేమంత పెద్ద రెమ్యునరేషన్ కాదని..ఇవ్వడానికి వెనకాడటం లేట.
ఇక, మాస్ మహారాజ రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాను చేసింది. ఈ సినిమా ఫ్లాప్ కాగా, ఆ తర్వాత చేసిన కాంత, ఆంధ్రాకింగ్ తాలూకా, కింగ్డం సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. దాంతో, ఇక టాలీవుడ్ లో భాగ్యశ్రీ పని అయిపోయిందనుకున్నారు. కానీ, ఇంకా ఈ బ్యూటీ చేయాల్సిన సినిమాలు ఉన్నాయని లెనిన్ ప్రూవ్ చేసింది.












