రాష్ట్రంలో వర్షాలు లేక తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని మరిచి కొందరు నీటిని వృథా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నీళ్లు లేక చాలా వరకు బస్తీలు, అపార్ట్ మెంట్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ఈసారి ఎన్ నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు లేక గ్రౌండ్ లెవల్ వాటర్ భారీగా పడిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో నగరంలో ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది.
ఎప్పుడైనా సమ్మర్‌లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ, వర్షాకాలంలో వర్షాలు రాకపోవడంతో నీటికటకట ఏర్పడింది.కంపెనీలు, ఫ్యాక్టరీలు, కమర్షియల్ కాంప్లెక్సులు, గృహ అవసరాల కోసం నీటిని ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు హైదరాబాద్ మహానగర పరిధిలో తాగు నీటి అవసరాలు తీర్చే జంటజలశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వ లేదని తెలుస్తున్నది.
https://x.com/ChotaNewsApp/status/2078121091890065819?s=20
దీంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం, అధికారులు ఎన్నిసార్లు అవగాహన కల్పించిన కొందరి తీరులో మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాగు నీటిని వృథా చేసినందుకు గాను జలమండలి అధికారులు ఓ వ్యక్తికి షాక్ ఇచ్చారు.
వివరాల్లోకివెళితే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో తాగునీటితో ఇంటి ప్రాంగణాన్ని ఓ వ్యక్తి శుభ్రం చేశాడు. దీంతో వాటర్ బోర్డు అతనికి రూ. 5 వేల జరిమానా విధించింది. తాగునీటిని వాహనాలు, రోడ్లు, ప్రాంగణాల శుభ్రతకు వాడకూడదని బోర్డు స్పష్టం చేసింది. నియమాలు అతిక్రమిస్తే నీటి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరికలు జారీచేసింది. నీటిని వృథా చేయకుండా బాధ్యతగా వినియోగించాలని ప్రజలకు సూచనలు చేసింది.












